22 ఉల్లాసకరమైన తెలుగు సమేతాలు, ఖచ్చితంగా మీరు రైడ్‌ని ఆనందిస్తారు
మీకు హెడ్డింగ్ చూస్తేనే అర్ధం అయ్యి ఉంటుంది... అవును, ఉల్లాసమైన తెలుగు సమేతాలు... మన పెద్దవాళ్ళు, ముఖ్యముగా మన తాతలా, బామ్మ వాళ్ళ తరం వాళ్ళకి బాగా తెలిసినవి... అన్నీ సమేతలలోను యెంతో లోతుగా ఉంటుంది... అదే సమయంలో, యెంతో ఇంకాస్త ఉంటుంది. , అందుకే అవి అంత అద్భుతంగా అనిపిస్తాయి... కొన్ని వింటూ ఉంటే ఎంత నవ్వొస్తుంది... మనం మన పెద్దోళ్లు ఆ సమేతాలు వాదినప్పుడు వినాలి, అసలు పిచ్చా కామెడీగా ఉంటుంది... సింపుల్ గా చెప్పాలంటే చాలా సన్నివేశం ఉంది... లు, ఆటో పంచ్ లు అని ఇప్పుడు ఉన్నాయ్ కానీ, వాటి బాబులకే బాబులు ఈ వ్యంగ్య సమేతాలు... సరే సరే ఇక రైడ్ స్టార్ట్ చెద్దాం... గెట్ రెడీ టు బిగ్ లాఫ్...
1) మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలదాన్ని కొట్టినట్లు...
అర్ధమయ్యిందా..!! సూపర్ లెర్నర్ వీరా బాబు నువ్వు అని వ్యంగ్యంగా యేసినట్లు...
2) తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట!
జంగం దేవర... థియరీ చదివితే ప్రాక్టికల్ యే చేసి చూపారేంటి సామీ...
3) అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు...
ఒరయ్యో... అంటే పరోక్షంగా అదే అన్న మాట...
4) అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట...
మహా గొప్ప మేధావివీర బాబు నువ్వు...
5) శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట...
మీకు తెలిసే ఉంటుంది ఇది... క్లియర్ గా ఉంది...
6) అందరూ శ్రీ వైష్ణవులే - రట్టెడు రొయ్యలు మాయమయ్యాయి
చెప్పేవన్నీ పఠీవ్రత మాటలు, యేసేవన్నీ పఠీవ్రత మాటలు...
7) మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా వుంటుందా?
అబ్బబ్బే... అలా యేలా ఉంటుంది... అస్సలు ఉండదు గాక ఉండదుగా... మూతి వాయాల్సిందే...
8) చదువుకోకముందు కాకరకాయ అని, చదువుకున్నాక కీకరకాయ అన్నాడట...
అబ్బో...అబ్బబ్బో...అద్భుతమైన విజ్ఞానం సంప్దించవయ్యా చంద్రం...
9) ఆడది తిరిగి చెడతాడు, మగవాడు తిరగక చెడతాడు...
ఏదో ఆరోజుల్లో అలా కానీ, ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వుద్దా... అంతా గతించిన కాలం...
10) అంబలి తాగేవాడికి మీసాలెత్తే వాడొకడా..!
నువ్వు చేసేపనికి నీకో సేవకుడు ఆ అని యెంత చక్కగా చెప్పారో మహానుభావులు...
11) ఆకారం చూసి ఆశపడ్డానే గానీ అయ్యకు అందులో పసలేదని నాకేం తెలుసు...
ష్స్స్..... నో కామెంట్స్.... పాడు బుర్ర తో ఆలోచించొద్దే...
12) ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే, బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడట...
ఎంత టైమింగ్ అమ్మా...నీ బ్రతుకు...అంతేలే, యెవడి యాపారం ఆడది...
13) ఉద్యోగం పురుష లక్షణం, అదిపోతే అవలక్షణం
మహానుభావులు ఆ రోజుల్లోనే చెప్పారు... ఇప్పుడు అయితే ముందు అది రావాలి కదా... కానీ చిన్న మార్పు... ఉపాధి పురుష లక్షణం, అధి దొరకడమే లక్ష్యం...
14) ఒడ్డు చేరేదాకా ఓడ మల్లయ్య - ఒడ్డు చేరాక బోడి మల్లయ్య...
మరే... పని అయిపోయింది కదా, అలానే వస్తాయ్ సార్ మాటలు... సార్, దెబ్బేసారు సార్, బాగా దెబ్బ సార్... మార్చిపోలేని దెబ్బేసారు సార్...
15) అరిటాకు మీద ముల్లు పడ్డ, ముల్లు మీద అరిటాకు పడ్డ అరిటాకుకే ముప్పు...
తెలిసినదే కదా.. బొక్క ఆకు కే...
16) అయినవాళ్ళకు ఆకులలోను, కాని వాళ్ళకు కంచాలలోను.
మరే... జనాలు ఇలానే కదా ఆలోచించేది... అంటే కొంతమంది, పరిస్థితి ఏదయినా కావచు లే...
17) ఊహలు ఊళ్ళేలుతుంటే, ఖర్మం కట్టెలు మోస్తుంది, ఋద్ది భూములు ఏలదామంటే రాత గాడిదలు కాస్తానంటుంది.
మహానుభావులు, యెంతటి సత్యం చెప్పారో... చి ధీనమ్మ జీవితం...
18) గుమ్మడికాయంత తెలివి కంటే, గురివిగింజంత అద్రుష్టం మేలు...
నిరాశ చెందిన ఆశావహులకు ఇది పూర్తిగా సముచితమని నేను భావిస్తున్నాను...
19)చెడి స్నేహితుడింటికి పోవచ్చు గానీ, చుట్టాలింటికి పోరాదు...
అయ్యా... దేవుడు సామి మీరు... కొన్ని కోట్ల హృదయాల్లో ఇదే కదా ఉంది...
20) తద్దినానికి భోజనానికి పిలిస్తే, రోజూ మీ ఇంట్లో ఇలానే జరగాలన్నాడట...
ఓరి వాడి తిండి బంగారం గాను... భలే వాడివి బోస్సు...
21) ఛీ కుక్క అంటే ఏమక్కా..! అన్నదట...
ఎంత తెలివైన కుక్క...
22) మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు ఏడిచిందట...
అంతేనండీ... కొట్టుకున్నా కోరుకున్నా అంత లోపలే అని ఊరికే అన్నారా మరి పెద్దలు...
Oo mostharugaa ayinaa navvukoni untaare... Ilaa cheppukunte Pothe konni Vela saamethalu untayi... Annii ikkada kashtam kabatti konni alaa alaa... ఇక మీరు మీకు తెలిసిన సమేతలను కామెంట్ బాక్స్ లో వేస్తే అందరు చదవండి... ఆనంద చదవండి
"జై జవాన్ - జై కిసాన్ - జై స్రామిక్"
- గణేష్ గుల్లిపల్లి