అమ్మ నుండి ప్రతి అబ్బాయి ఎదుర్కొనే 9 చాలా సాధారణ ప్రశ్నలు
అమ్మా...ప్రతీ అమ్మాయికి ఢక్కే గొప్ప బిరుదు... కొడుకు, ఆ అమ్మకి దక్కిన గొప్ప బహుమతి... యెంత నాన్న కూతురు, నాన్న రాజకుమారి అన్నా కూడా, అమ్మ కొడుకు అంటే చాలా స్పెషల్... అధంతే, ఎవరు యెంత అన్నా అమ్మమాత్రం ... Ofcourse konni thitlu koodaa amma nundi untaay untaay anukondi, kaani ikkada positivity kosam raasthunnaam kabatti, aa panthaalone maatlaadukundhaame, hihihihihihihi... సరే సరే, విషయం యేంటంటే, ఎవరు చాలా తక్కువగా ఉన్నాను నేను వచ్చే ప్రశ్నలు మాత్రం వెరీ వెరీ కామన్ గా ఉంటాయ్, అంటే యెప్పుడయినా ఆ ప్రశ్నలు మారవు గాక మారవు... సరే సరే సరే, చూడం అంటారు ఆ ప్రశ్నలు ఏంటో, అంతేగా... పద పద...
గమనిక: అంటే ఉగాధి వస్తుంది కదా, ఏలానో ఇంటికి వెళతాం కదా, ఆ టైమ్‌లో పదే ప్రశ్నలు కూడా కలిపి వేస్తున్నా...
1) తిన్నావా నాన్నా?
మొన్నీ మధ్య నితిన్ అన్న ఒక ప్రకటన చేసారు స్నేహ చికెన్ కోసం... అందులో చెప్తారు కదా, అమ్మ యెప్పుడు అదిగేది ఒకటే, తిన్నామా లేధా అని... ఏంటో అమ్మ మనల్నెప్పుడూ పసోల్లలానే చూస్తుంది...
2) యెంట్రా చిక్కిపోయావ్?
వెరీ వెరీ చాలా సాధారణ ప్రశ్న... ఇంటికి వెళితే ఇదే మొదటి ప్రశ్న... ఏంటి చిక్కిపోయావ్, తినడం లేద సరిగ్గా..? అమ్మకి అనిపిస్తుందేమో, వీడు టైమ్ కి నేను పెడితే గానే తింటాడు అని... అమ్మ అంటే... లవ్లీ...
3) ఏం కావాలి/చెయ్యమంటావ్?
అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నాం అనుకో, ఏం తింటావ్ నాన్న, ఏం చెయ్యమంటావ్, ఏమన్నా స్పెషల్ గా కావాలి, యేమన్నా తినాలంటే చెప్పు చేస్తా, అవి చేయనా, ఇవి చేయనా అని పెద్ద మెను కార్డ్ ఏ పాడుతుందీ..., మనమ్ రాయిచ్చే అంతే, నువ్వు ఏది పెట్టినా తింటా, ఆకలేస్తుంది" అని... అమ్మకి ఎప్పుడూ మనం ఏదో ఒకటి ఆశించాలి, చేసి పెట్టు అని అడగాలి అనుకుంటుంది... అధో రకం తృప్తి...
4) ఏమన్న అలవాటు?
అంటే అమ్మ అన్నాక కొన్ని భయాలు ఉంటాయ్ కదా, తాగు, సిగరెట్ లాంటివి ఏమయినా మనం మొదలెట్టేసామేమో, అక్కడ ఫ్రెండ్స్ తో ఉన్నాం, కొత్త అలవాటు యేమయినా అయ్యిందేమో... ఇదీ యెంతమంది పోయావు, ముఖం మీద పడ్డట్టుంది... కొంచెం లావు అయిన అమ్మ కి యేదో సందేహం వచ్చేస్తది...
5) ఎవరినన్నా చూసుకున్నావా ఏంటి?
అవును అదే... అమ్మయిలా గురించి... అంటే ఏ మాత్రం మన ఫోన్ వాదకం లో తేడా వచ్చినా, లేని పోని ఎక్స్ ప్రెషన్స్ కనిపించినా, లేక టైమింగ్స్ లో కొంచెం అటు ఇటూ అయినా అమ్మ పసిగట్టేస్తోంది... ఆ పవర్ యేలా వస్తుంది...అంధుకే అంటారేమో, అమ్మకి అన్నీ తెలిసిపోతాయేమో అని...
6) నాకు చెప్పలేదు?
మోస్ట్ పాపులర్... అమ్మా అన్నీ తానతో షేర్ చేసుకోవాలి అనుకుంటుంది... మనం ఏమన్నా చెప్పకుండా చేసి, ఎప్పుడూ ఫ్లోలో చెప్పేయడమో, లేక మన చెప్పుకుందా తెల్సిందో ఇక అంతే... తనకి చెప్పలేదనీ ఓ ఫీల్ అయిపోద్ది... అంతే కాదు అందరు. . అమ్మ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా ఇంతే, ఆ స్వాధీనం ఒకటే... అన్నీ చెప్పాలి వాళ్లకి... కొందరు ఇంకా అడ్వాన్స్ అయ్యి, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నవా అంటారు, అలా కూడా మనం సురక్షితంగా ఆయుపోవచ్చు...
7) ఈ అలవాటు యెప్పటి నుండీ?
బాబోయ్, ఇది నెక్స్ట్ లెవెల్... ఇందాక పైనా చెప్పా కదా, మనలో ఏ చిన్న తేడా వచ్చినా అమ్మ పసిగట్టేస్తోంది అని... కొన్ని మనం సీక్రెట్ గా ఉంచకపోయినా అమ్మకి నచ్చనిది ఏదయినా చేస్తే ఈ డైలాగ్ పాడతాది... అని ఎందుకు చెప్పుకోవాలి...
8) ఫోన్ చేసావా?
మన కృష్ణ బాబాయ్ కో, రాధా అత్త కో కాల్ చేసామా అన్న ప్రశ్న అన్న మాట... అంటే మనం కాల్ చెయ్యలేదు, మాట్లాడలేదు, వాళ్ళు మనకి పొగరు, పట్టించుకోడు యెక్కడా అనేసుకుంటారో అని అమ్మ ఒక్కసారి వాళ్ళకి చేసే నాన్న ఒక్కసారిగా, కేవలం ఒకప్పుడు మాత్రమే చెప్పండి ఆగాలో cheppesthundhi... మరి అమ్మ మనం యెక్కడా తగ్గినా ఒప్పుకోదు...
9) పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్?
27/28 ధాటితే ఇదే ప్రశ్న ఇంకా ఇంట్లో...ముఖ్యంగా అమ్మే కదా అడిగేది...ఇంకెప్పుడు చేసుకుంటావ్ రా అని...పిల్లని చూడనా, పెద్ద అత్త వాళ్లని చూడమని చెప్పనా,చిన్న తత్తయ్య యేదో సంబంధం అనాడు...అని చెప్తాను ఇదిగో ఇంకెప్పుడు రా అని అంటుంది... ఇక ఫోన్ చేసిన ప్రతీసారి ఇక ఆ ప్రశ్నే...
అయ్యిపోయింది... అమ్మ గురించి అంటే అందరికి కనెక్ట్ అవుతుంది... యెందుకంటే, యే అమ్మ అయినా సరే కొడుకుంటే ప్రేమ అదే కాబట్టీ... సో, అధన్న మాట సంగతి... ఇక మీరు కూడా ఏమన్నా ఎక్స్‌ట్రా గా ఎక్స్‌పీరియన్స్ చేసి ఉన్నా, లేక పై వాటిల్లో అనుభవం చేసారో కింద పెట్టెలో వేసింది, నేను చూస్తా... ఉంటా మరి...
జై శ్రామిక
- గణేష్ గుల్లిపల్లి