What if we compare Ram Gopal Varma and Trivikram Srinivas - Mad Monkey

రామ్ గోపాల్ వర్మ, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను పోల్చుకుంటే ఎలా ఉంటుంది

      

                                

మన తెలుగు సినిమాలో ఒకరు వాళ్ల డైరెక్షన్ లెవల్స్ తో తెలుగు సినిమా లెవెల్స్ నే మార్చేశారు. మరోకారు ఆయన ప్రసంగాలతో తెలుగు సినిమా విలువను పెంచిన వాళ్ళు. ఇద్దరివి భిన్న కోణాలు, ఇద్దరు భిన్న ధ్రువాలు. ఒకరు సినిమాలో మాటల గారడి చేస్తే, మరొకరు బయట, మాటల తూటాలు పేలుస్తారు. వాళ్లే మన ఆర్జీవీ గారు మరియు త్రివిక్రమ్ గారు... అసలు ఇప్పటి వరకు ఒకరి గురించి మరొకరు మాట్లాడిన సందర్భాలే తక్కువ... అసలు లేవేమో అని కూడా నా అభిప్రాయం... కానీ, అప్పుడెప్పుడో ఒక ట్వీట్ పెట్టి డిలీట్ చేసాడు. ఐతే, వీళ్లిద్దరినీ పోల్చుకుంటే కొన్ని తేడాలు ఒకేసారి కొన్నీ కామన్ పాయింట్స్ కూడా ఉంటాయ్... ఈ ఆర్టికల్ అలా అనిపించి వచ్చిందే... ఇక చూసుకోండి...

1) పుస్తక పాఠకులు

ఇద్దరికీ పుస్తకాలంటే పిచ్చే... కానీ, ఒకరేమో అయాన్ రాండ్, ఫ్రెడ్రిక్ నీచ్చే అంటూ ఆంగ్ల పుస్తకాలు యెక్కువగా, మరోకారు యుద్దనపూడి సులోచనా రాణి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి అంటూ తెలుగు పుస్తకాలను యెక్కువగా చదువుతారు... ఇద్దరూ...

2) మేకింగ్ స్టైల్

రామ్ గోపాల్ వర్మ- హింసాత్మక మరియు చీకటి సినిమాలు

త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఫ్యామిలీ ఎంటర్టైనర్స్

3) కథ రకం

రామ్ గోపాల్ వర్మ - కల్పితాలతో కూడిన యధార్థం

త్రివిక్రమ్ శ్రీనివాస్ - యధార్థాలతో కూడిన కల్పితం

4) మాటలు

రామ్ గోపాల్ వర్మ - ఆలోచనలు కొత్త ధారులు వేతికేల చేస్తాయ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఆలోచనలు సరైన ధారులు వేతికేల చేస్తాయ్

5) కోట్స్

రామ్ గోపాల్ వర్మ - అర్ధం చేసుకోవాలి అనేట్టు ఉంటాయి

త్రివిక్రమ్ శ్రీనివాస్ - అర్ధం చేసుకునేలా ఉంటాయ్

6) డ్రెస్సింగ్

రామ్ గోపాల్ వర్మ - గ్యాప్ టీ షర్టులు, టీ షర్టులు

త్రివిక్రమ్ శ్రీనివాస్ - గ్యాప్ టీ షర్టులు, టీ షర్టులు

7) ఇంటర్వ్యూలు

రామ్ గోపాల్ వర్మ - మరో స్థాయి ఆలోచన

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మరో స్థాయి సమాచారం

8) సినిమా

రామ్ గోపాల్ వర్మ - మతి పోయే షాట్స్

త్రివిక్రమ్ శ్రీనివాస్ - మార్చిపోలేని మాటలు

9) అనుచరులు

రామ్ గోపాల్ వర్మ - కనబడని వేదాంతులు

త్రివిక్రమ్ శ్రీనివాస్ - కనబడే మేధావులు

10) అనుభవం

ఇద్దరికీ అసిస్టెంట్ డైరెక్టర్ గా అనుభవం లేదు, డైరెక్ట్ గా డైరెక్టర్... (వర్మ గారు చేసిన ఆది అసిస్టెంట్స్ కాస్త అసిస్టెంట్స్ కాస్త అసిస్టెంట్... సో, ఇద్దరూ ఒకటే...)

11) సినిమా బడ్జెట్

రామ్ గోపాల్ వర్మ - చాలా తక్కువ

త్రివిక్రమ్ శ్రీనివాస్ - కొంచెం యెక్కువ

12) మేము పిలుస్తాము

రామ్ గోపాల్ వర్మ - దర్శకుడు

త్రివిక్రమ్ శ్రీనివాస్ - రచయిత

సరిగ్గా గమనిస్తే వాళ్ల ఆలోచన ఒకేలా ఉంటుంది. ఇద్దరి స్థానాలు వేరయినా ఆలోచన స్థాయీ ఒకేలా ఉంటుంది. ఒకరి నోట మరోకరి మాట యెప్పుడొస్తుందో చూడాలి మరి....

"త్రివిక్రమ్"

- గణేష్ గుల్లిపల్లి








తిరిగి బ్లాగుకి